శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు|| దశమి రా.6.55 ఆశ్రేష ఉ.9.38 రా.వ.10.46 ల 12.31. ఉ.దు. 10.01 ల 10.50 ప.దు. 2. 54 ల 3.43.
మేషం :- గృహం కొనుగొలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. టెండర్లు చేజిక్కించుకుంటారు. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఓ మంచివ్యక్తి అభిమానాన్ని పొందుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
వృషభం :- ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకా లెదురవుతాయి. ఊహించని ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు అంతగా ఉండవు. క్రయ విక్రయాలు సంతృప్తినిస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. మిమ్ములను పొగిడే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి పని భారం అధికమవుతుంది.
మిథునం :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయలు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కంది, మినుము, పెసర, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు మెళకువ అవసరం.
కర్కాటకం :- మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వారసత్వపు వ్యవహారాలలో సమస్యలు వంటివి తలెత్తుతాయి. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. మితిమీరిన ఆలోచనలు, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అనారోగ్యానికి గురవుతారు.
సింహం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. పండ్లు, కొబ్బరి, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నెలసరి వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
కన్య :- నూతన దంపతుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. కోర్టు వ్యవహరాలు, భూ వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. మొండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి.
తుల :- చిన్న తరహా వృత్తులు, హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. సోదరి, సోదరులతో అనుకోని ఇబ్బందులు, చికాకులను ఎదుర్కుంటారు. దంపతుల మధ్య కలహాలు, పట్టింపులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి.
వృశ్చికం :- ప్రముఖుల సహకారంతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురవుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికం. విధ్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
ధనస్సు :- భార్యా, భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వ్యవసాయదారులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తిరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది.
మకరం :- వ్యాపార వర్గాల వారికి చెక్కుల జారీ, పెద్ద మొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుకుంటారు.
కుంభం :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిదికాదని గమనించండి.
మీనం :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఒక కార్యం నిమిత్తం తరుచు ప్రయాణాలు తప్పవు.