Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-04-2024 మంగళవారం దినఫలాలు - ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా..

Advertiesment
astrolgy

రామన్

, మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ అష్టమి సా.4.24 పునర్వసు ఉ.6.10 ప.వ. 2.40 ల 4.22. ఉ.దు. 8.24 ల 9.12 రా.దు. 10.52 ల 11.39.
 
మేషం :- ఆర్థిక వ్యవహరాల్లో కొంత పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. లిటిగేషన్ వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటింటం ఉత్తమం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు, ఆస్తి వివాదాలు తేలక నిరుత్సాహం చెందుతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
వృషభం :- ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వైద్య, న్యాయ రంగాల వారికి ఏకాగ్రత చాలా అవసరం. మీరు అనుకున్న కాంట్రాక్టులు చేతికి అందుతాయి. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. చేస్తున్న పనిపై ఆశక్తి తగ్గే అవకాసం ఉంది. ఉద్యోగయత్నంలో బిడియం, భేషజం తగదు.
 
మిథునం :- సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పత్రాలు, నోటీసులు అందుకుంటారు. రాబడికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
 
కర్కాటకం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు చికాకుపరుస్తాయి. స్థిరాస్తి వాదాలు పరిష్కార దిశగా నడుస్తాయి. ఉన్నత విద్యకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. షాపుల స్థల మార్పిడి, వాస్తుదోష నివారణవల్ల మంచి ఫలితాలుంటాయి. వ్యాపారాల అభివృద్ధికి స్థల మార్పు, వాస్తుదోష నివారణ అనుకూలిస్తాయి.
 
సింహం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వాయిదాలకు హజరవుతారు. ఊహించని సంఘటనలు సైతం ఎదుర్కొనడానికి సంసిద్ధులై ఉండండి. విద్యుత్ రంగంలోవారు మాటపడక తప్పదు. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి.
 
కన్య :- బంధువుల రాకవలన ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకొని సంప్రదింపులు జరుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. తరచూ సభ, సమావేశాలలో పాల్గొంటారు. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
తుల :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ సంతానం కదలికలను గమనిస్తుండాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీ మూలకంగా వివాదాలు ఎదుర్కుంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి.
 
వృశ్చికం :- మీ సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పని భారం పెరుగుతుంది. మీ పొరపాట్లను సరి దిద్దుకొని ముందుకు సాగండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది.
 
ధనస్సు :- గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. మీ ఆలోచనా విధానాన్ని ఏ మాత్రం మార్చుకోవద్దు. చిన్నారులకు అవసరమైన వస్తువులను కోనుగోలు చేస్తారు. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మకరం :- వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని అవకాశాలు వస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. కొన్ని అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. బంధువులతో రాక గృహంలో సందడి కానవస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు.
 
కుంభం :- ఆర్థిక సమస్యలు తలెత్తుటం వల్ల ఆందోళన చెందుతారు. రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది. శ్రమ ఎక్కువైనట్లు అనిపిస్తే వెంటనే పని నుంచి విశ్రాంతి తీసుకోండి అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
మీనం :- బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. ప్రతి పని చేతిదాకా వచ్చివెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలనుగురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భద్రాచలం సీతమ్మకు సిరిసిల్ల నుంచి పెళ్లి చీర.. వెండి పోగులతో..?