Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-04-2024 శుక్రవారం దినఫలాలు - దైవ, పుణ్య సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి...

Advertiesment
kanya rashi

రామన్

, శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ చవితి సా.5.09 రోహిణి తె.4.49 రా.వ.8.57 ల 9.31. ఉ.దు. 8.22 ల 9.11 ప. దు. 12. 27 ల 1.16.
 
మేషం :- విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వేళతప్పి భోజనం చేయడం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుట వల్ల నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగులకు ప్రకటనలు, మధ్యవర్తుల విషయంలో అవగాహన ముఖ్యం.
 
వృషభం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు.
 
మిథునం :- ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటారు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
కర్కాటకం :- పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతారు. రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సంభాషించటం వల్ల మీలోమానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. ఏ.సి. కూలర్ మెకానిక్ రంగాలలో వారిక సంతృప్తి కానవస్తుంది. 
 
సింహం :- ప్రకటనలు, రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సహకరంగా ఉంటుంది. దైవ, పుణ్య సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
కన్య :- వస్త్ర, బంగారు, ఫ్యాన్సీ, పచారి వ్యాపారస్తులకుసంతృప్తి, పురోభివృద్ధిని పొందుతారు. ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల జోక్యం వలన మీ పాత సమస్యలు పరిష్కరించబడతాయి. అలౌకిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు రాగలవు.
 
తుల :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసివస్తుంది. ఉమ్మడి వ్యాపారాల్లో పునరాలోచన అవసరం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత మెళకువ చాలా అవసరం. సంతానం పై చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. స్త్రీలకు అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కోర్టు వ్యవహరాలు వాయిదా పడతాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.
 
ధనస్సు :- బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఆస్తి పంపకాలలో పెద్దల తీరు మిమ్ములను ఇరకాటంలో పెట్టవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. రాజకీయాల్లో వారు ముఖ్యమైన వ్యవహారాలను గోప్యంగా ఉంచడం మంచిది. కళాకారులకు, రచయితలకు, పత్రికారంగంలోని వారికి అనుకూలమైన కాలం.
 
మకరం :- తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు. కుటుంబంలో ప్రశాంతత, ప్రేమానుబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులు అధికారులతో సాన్నిత్యం నెలకొంటుంది. విదేశీ చదువులకై చేయుప్రయత్నాలలో విజయం.
 
కుంభం :- శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసిన గాని నిలదొక్కుకోలేరు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినాగానీ నెమ్మదిగా సమసిపోతాయి. ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వలన ఆరోగ్యం భంగం.
 
మీనం :- ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరామ లవకుశుల యుద్ధభూమి.. వకుళ వృక్షం.. శిరువాపురి.. ఎక్కడ?