Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-04-2024 సోమవారం దినఫలాలు - మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి...

Advertiesment
Mithunam

రామన్

, సోమవారం, 8 ఏప్రియల్ 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ బ॥ అమావాస్య రా.12.26 ఉత్తరాభాద్ర ఉ.10.09
రా.వ.9.22 ల 10.52. ప. దు. 12.27 ల 1.16 పు.దు. 2.53 ల 3.42.
 
మేషం :- వృత్తి వ్యాపారలలో మంచి మార్పులు రాగలవు. స్త్రీల వాక్ చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎటువంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొంటారు. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు.
 
వృషభం :- దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. రావలసిన ధనంచేతికందుతుంది. ఇతరులకు అతి చనువు ఇవ్వటం మంచిది కాదని గమనించండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం.
 
మిథునం :- రిప్రజెంటేటివ్‌‍లు, పత్రికా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. ఆడిటర్లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. 
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు ఎటువంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ఏకాగ్రతతో వ్యవహరించటం అన్ని విధాలా క్షేమదాయకం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదుర్కుంటారు. అప్రయత్నంగా కొన్ని వ్యవహరాలు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
సింహం :- మీ చిన్నారులకు ధనం అధికంగా వెచ్చిస్తారు. నూతన వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో వ్యూహత్మకంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కన్య :- విదేశీ పరిచయాల వల్ల పురోగతి లభిస్తుంది. కొంత మంది మీ నుండి ధన సహాయం కోరవచ్చు. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. ఆస్తి వ్యవహరాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకుఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.
 
తుల :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొబ్బరి,పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. కొత్త సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది.
 
వృశ్చికం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పాత బిల్లులు చెల్లిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. న్యాయసంబంధిత వివాదాల్లో విజయం సాధిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు.
 
ధనస్సు :- రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకమైన కాలం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. కొత్త దనాన్ని కోరుకుంటారు.
 
మకరం :- విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు కూరలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బదిలీలు మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి.
 
కుంభం :- ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. మీ కార్యక్రమాలు, పనులు అనుకున్నంత చురుకుగా సాగవు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించండి. వృత్తులలోని వారికి బాధ్యతలు పెరుగును. మందులు, రసాయినిక, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలసిరాగలదు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. దైవ కార్యాలో చురుకుగా వ్యవహరిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-04-2024 ఆదివారం దినఫలాలు - మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు...