Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-04-2023 తేదీ బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (04:01 IST)
మేషం :- బంధువుల నుంచి విమర్శలు తప్పవు. స్త్రీల పట్టుదల, మొండి వైఖరి సమస్యలకు దారితీస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు అనుకూలం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది.
 
వృషభం :- కొబ్బరి, పండ్లు, పూల చల్లని పానియవ్యాపారులకు లాభదాయకం చిన్ననాటివ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. రావలసిన బకాయిలు విషయంలో మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించు కోవటం ఉత్తమం.
 
మిథునం :- ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. పొగడ్తలు, విమర్శలను హుందాగా స్వీకరిస్తారు. ఇంట్లో వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తారు. దైవ కారక్రమాల్లో పాల్గొంటారు. మీ శ్రీమతి మొండి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- ప్రైవేటు సంస్థల్లోవారికి ఒత్తిడి, చికాకులు తప్పదు. విందులు, విలాసాలలో మితంగా వ్యవహరించండి. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి పెరుగుతుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
సింహం :- మీ సంతానం ఇష్టాలకు అడ్డుచెప్పటం మంచిది కాదు. మీ కళత్రమొండి వైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. రవాణారంగంలోని వారికి చికాకులు వంటివి ఎదుర్కొంటారు. గతంలో ఇచ్చినహామీల వల్ల వర్తమానంలో ఇబ్బందులెదురవుతాయి.
 
కన్య :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. సంఘంలో మీమాటపైనమ్మకం, గౌరవం పెరుగుతాయి.
 
తుల :- శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు.
 
వృశ్చికం :- కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు :- బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఫ్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఖర్చులు అధికం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
మకరం :- ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహరాలు, ప్రయాణాలలో తగుజాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో దుడుకుతనంకూడదు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వల్ల అనుకోని ఇబ్బందులెదుర్కుంటారు.
 
కుంభం :- స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరకపటుత్వం నెలకొంటుంది. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్య సమస్యలు వంటి చికాకులు అధికమయ్యే అవకాశం ఉంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు పనిభారం అధికమవుతుంది.
 
మీనం :- మార్కెటింగ్ రంగాల వారికి ఓర్పు, అంకితభావం చాలా అవసరమని గమనించండి. ఉద్యోగస్తులు విధినిర్వహణలో ఏమరుపాటుతనం వల్ల ఇబ్బందులు తప్పవు. భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ అవసరం. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

లేటెస్ట్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments