Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16-04-2023 ఆదివారం రాశిఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల...

Scorpio
, ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (09:15 IST)
మేషం :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలకు విశ్రాంతి లోపం, వేళతప్పి భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల పట్ల ఆస పెరుగుతుంది.
 
వృషభం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి.
 
మిథునం :- బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రావలసిన ధనం వాయిదా పడుట వల్ల ఆందోళన చెందుతారు. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
కర్కాటకం :- స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు.
 
సింహం :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించ లేకపోతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
కన్య :- మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. రాజకీయ నాయకులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. భాగస్వాముల మధ్య అవరోధాలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు.
 
తుల :- విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తి చూపుతారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. రుణాల కోసం అన్వేషిస్తారు. బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం రావడంతో మీ ఆలోచనలు పలువిధాలు ఉంటాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
ధనస్సు :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ పనివారలకు కలిసివచ్చే కాలం. 
 
మకరం :- విందు, వినోదాలలో పరిమితి పాటించడం మంచిది. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికం కాగలవు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. కానీ వెళ్ళల్లో ఇతరుల రాక ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
 
కుంభం :- స్త్రీలకు బంధువులలో పేరు, ఖ్యాతి లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మిత్రుల కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు.
 
మీనం :- హోటలు తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు షాపింగ్ దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కోపంతో పనులు చక్కబెట్టలేరు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-04-2023 తేదీ శనివారం దినఫలాలు - సత్యనారాయణస్వామిని పూజించిన శుభం...