Webdunia - Bharat's app for daily news and videos

Install App

17-07-2023 సోమవారం రాశిఫలాలు - సుబ్రమణ్యస్వామిని ఆరాధించిన మీ సంకల్పం...

Webdunia
సోమవారం, 17 జులై 2023 (04:00 IST)
మేషం :- స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర, వెండి, బంగారం, పచారీ, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందుల, ఆల్కహాలు వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. 
 
వృషభం :- బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకొలేకపోతారు. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
మిథునం :- ఆర్థిక వ్యవహారాలలో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కలవు. ఓర్పుతో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. కళాశాలలో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం. పెన్షన్, బీమా సమస్యలు పరిష్కారం అవుతాయి. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. 
 
కర్కాటకం :- చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలో ఖర్చులు అంచనాలు మించుతాయి. బంధువుల కలయికతో నూతనోత్సాహం కానవస్తుంది. గృహ నిర్మాణం, ఫర్నిచర్ కొనుగోలుకు నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తాయి.
 
సింహం :- వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదాపడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. చేతి వృత్తుల వారికి ఇబ్బందులు తప్పవు. అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. సమావేశాలకు ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
కన్య :- ఆర్థిక విషయాలలో ఏకాగ్రత అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. మీకు కాలం అనుకూలంగా ఉన్నట్లు తోస్తుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. 
 
తుల :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. ప్రముఖులను, మిత్రులను కలుసుకుంటారు. మీ సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నిరుద్యోగులకు ప్రకటన పట్ల అవగాహన ముఖ్యం. ఇరుగు, పొరుగువారితో కలహాలు తలెత్తుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
వృశ్చికం :- ఆర్థిక వ్యవహారాలో పురోభివృద్ధి. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలసి వచ్చేకాలం. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. ధనం నీళ్ళ ప్రాయంగా ఖర్చవుతుంది. సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యుల నుండి వార్తలు అందుకుంటారు.
 
ధనస్సు :- నిరుద్యోగులకు ఆశాజనకం. వడ్డీలు, డిపాజిట్లు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగసదావకాశాలు లభిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహరాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మిమ్ములను తక్కువ అంచనా వేసిన వారే మీ సమర్థతనుగుర్తిస్తారు.
 
మకరం :- కోర్టు తీర్పులు, పెద్దల నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటాయి. విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ అనుకూలిస్తుంది. దైవ సేవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన చోదకులకు ఆటుపోట్లుతప్పవు.
 
కుంభం :- అతిథి మర్యాధలు బాగుగా నిర్వహిస్తారు. ఉన్నతాధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాణిజ్య ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
 
మీనం :- ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీలకు బంధువులతో పట్టింపులు ఎదురవుతాయి. మీ పనులు మందకొడిగా సాగుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

లేటెస్ట్

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

తర్వాతి కథనం
Show comments