Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-07-2023 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం...

Advertiesment
Leo
, బుధవారం, 12 జులై 2023 (04:00 IST)
మేషం :- స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలు పనివారితో చికాకులును ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. ఉద్యోగస్తులు అధికారుల నుండి మెప్పు పొందుతారు. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు. ఓర్పు, సర్దుబాటు ధోరణితోనే పరిస్థితులు సర్దుకుంటాయి.
 
వృషభం :- విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్, కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికరుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మొండిబాకీలు వసూలు కాగలవు. పదవులు, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువు చేజారిపోయే ఆస్కారం ఉంది. రవాణా రంగాల వారికి ఆందోళనలు వంటివి అధికమవుతాయి.
 
మిథునం :- వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీల ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సభలు సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఖర్చులు తగ్గించుకోవాలనలే మీ యత్నం అనుకూలిస్తుంది.
 
కర్కాటకం :- ఉన్నతస్థాయి ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెలకువ వహించండి. బంధు మిత్రుల కలయికతో నూతన ఉత్సాహం కానవస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
 
సింహం :- శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు.
 
కన్య :- ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్న బలమైన కోరిక నెరవేరుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కిరణా, ఫ్యాన్సీ, కొబ్బరి, పూల, పండ్ల వ్యాపారులకు శుభదాయకం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
 
తుల :- ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు దూరప్రదేశంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. కొన్ని సమస్యలు మబ్బు విడినట్లు విడిపోవును. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.
 
వృశ్చికం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. శారీరక శ్రమ, మానసికాందోళనల వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్త్రీలు టి.వి. ఛానల్స్ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
 
ధనస్సు :- విద్యుత్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. స్థిరచరాస్థుల విషయంలో సంతృప్తి కానవస్తుంది. మిత్రుల కలయికతో గత స్మృతులు జ్ఞప్తికివస్తాయి. ఖర్చులు పెరిగినా ఆర్థికస్థితిలో ఏమాత్రం లోటుండదు.
 
మకరం :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోనూ అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. దైవకార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార రంగాలలోని వారికి గణనీయమైన అభివృద్ధి.
 
కుంభం :- ఆలయాలను సందర్శిస్తారు. ప్లీడర్లకు, ఫ్లీడరు గుమాస్తాలకు అనుకూలం. మీ శ్రీమతి వైఖరిలో మీరు ఆశించిన మార్పు సంభవిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. విదేశాలు వెళ్లటానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
మీనం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కుంటారు. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లను ఎదుర్కొంటారు. విద్య సంస్థలలో వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరికైనా నరదృష్టి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? పరిహారాలు ఏమిటి?