Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-07-2023 శనివారం రాశిఫలాలు - వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం..

Advertiesment
Capricorn
, శనివారం, 8 జులై 2023 (04:00 IST)
మేషం :- ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు. అధికమవుతున్నారని గమనించండి. క్లిష్ట సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ సంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి.
 
వృషభం :- కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీవారి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, తిప్పట తప్పవు. ప్రేమానుబంధాలు, ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మరింత బలపడతాయి. 
 
మిథునం :- మీ కుటింబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. మార్కెటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా గానీ నెమ్మదిగా సమసిపోతాయి. 
 
కర్కాటకం :- ఒక అనుభవం మీకెంతోజ్ఞానాన్ని ఇస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. తరచూ సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి.
 
సింహం :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహరాల పునరాలోచన అవసరం. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతుంది. ఆలయ సందర్శనాలలో ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. భాగస్వామికులకు మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. దంపతుల మధ్య ప్రేమాను రాగాలు బలపడతాయి. ఎంతో శ్రమించిన మీదట గాని అనుకున్న పనులు పూర్తి కావు.
 
తుల :- మీ నిర్లక్ష్యం వల్ల గృహంలో విలువైన వస్తువులు చేజారిపోతాయి. జాగ్రత్త వహించండి. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు.
 
వృశ్చికం :- గృహంలో మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలలో చికాకులు తప్పవు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. సోదరీ, సోదరులతో ఏకీభవిచలేకపోతారు. విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తుసామగ్రి అందజేస్తారు.
 
ధనస్సు :- ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను అధికంగా ఎదుర్కుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు ఎంతశ్రమించినా గుర్తింపు లేకపోవడంతో ఆందోళనకు గురవుతారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
మకరం :- ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పుసంభవం. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. తొందరపాటుతనం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఏ విషయంలోను మనస్థిమితం అంతగా ఉండదు. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.
 
కుంభం :- పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. దేవాలయ విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడంవల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. విద్యార్థులకురెండవ విడత కౌన్సెలింగ్ అనుకూలం. కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
మీనం :- విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్పురిస్తుంది. మీ శ్రీవారి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం. హోటల్, తినుబండా వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణపక్షం, శుక్రవారం, పంచమి తిథి.. వారాహికి కొబ్బరి దీపం వేస్తే..?