Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

04-07-2023 మంగళవారం రాశిఫలాలు - నిత్యం సుదర్శన పారాయణ చేసినా శుభం

Gemini
, మంగళవారం, 4 జులై 2023 (04:00 IST)
మేషం :- ఆదాయవ్యయాలు సంతృప్తికరం. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులో అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. పన్నులు, ఫీజులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు.
 
వృషభం :- మీ ఊహలు, అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. రియల్ ఎస్టేట్, చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఆటుపోట్లు అధికమవుతాయి. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు.
 
మిథునం :- మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రాజకీయనాయకులు విదేశీపర్యటనలలో మెళుకువ అవసరం. వాహనయోగం వంటి శుభ ఫలితాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో ధనం అధికంగా వ్యయం చేస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు.
 
కర్కాటకం :- ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సోదరి, సోదరులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. ప్రకృతి, సౌందర్యాలను చూసి సంతృప్తి చెందుతారు. క్రయ విక్రయదార్లకు చికాకులు ఏర్పడతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు, ఒత్తిడి తప్పదు.
 
సింహం :- ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి. వ్యపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు విరక్తి కలిగిస్తుంది. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
కన్య :- మీ వాహనం ఇతరులకు ఇవ్వటం మంచిది కాదని గమనించండి. మీపై దుశ్శకునాలు, సెంటిమెంట్ల ప్రభావం అధికంగా ఉంటుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోను, వస్తు నాణ్యతలోను మెలకువ అవసరం. కొత్త పనులుచేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
తుల :- ప్రైవేటు రంగాల్లో వారికి ఒక ప్రకటన ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
వృశ్చికం :- నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. కొన్ని సమస్యలుచిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
ధనస్సు :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు సంతృప్తిని ఇస్తాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ఎంతోకొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశయం నెరవేరకపోవచ్చు. ప్రత్యర్ధుల కదలిక పట్ల ఓ కన్నేసి ఉంచడం శ్రేయస్కరం. 
 
మకరం :- మీ సంతానం కోసం విలువైన వస్తువులను సేకరిస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని చేపట్టిన పనులు పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
కుంభం :- ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. రవాణా రంగాలలో వారికి లాభదాయకం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యంగా ఉంటుంది.
 
మీనం :- రాజకీయాల్లో వారికి గుర్తింపు, లభిస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటిన మిత్రుల సహాయ సహకారముల వలన సమసి పోగలవు. విదేశాలు వెళ్లుటకు చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని రంగాలలోని స్త్రీలకు చాలాయోగ ప్రదంగా వుండగలదు. కాంట్రాక్టర్లకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలైలో జన్మించిన వారు ఇలా వుంటారు..