మేషం :- ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక, అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. హామీలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
వృషభం :- స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ చాలా అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మిథునం :- ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రిప్రజెంటేటివ్‌లు వారి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. వాహనం కొనుగోలుకై చేయుయత్నాలు వాయిదాపడతాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తులలో వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం :- స్త్రీలకు పనివారలతో ఇబ్బందులను ఎదుర్కుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అప్రయత్న ధనలాభములు, వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. విద్యార్థినుల్లో చురుకుదనం కానవస్తుంది.
సింహం :- ఆర్థిక విషయాలలో పురోభివృద్ధి కానవస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు రాకుండా చూసుకొండి. స్త్రీలకు ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి.
కన్య :- ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలలో పరిచయా లేర్పడతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధి పొందాలని యత్నిస్తారు. రాజకీయా నాయకులు సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.
తుల :- విద్యార్థులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా మొండిధైర్యంతో ముందుకుసాగి పూర్తి చేస్తారు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. దైవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. స్త్రీల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.
వృశ్చికం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులు పడుట వల్ల మాటపడకతప్పదు. శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రేమాను బంధాలు, ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మరింత బలపడతాయి.
ధనస్సు :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త. దైవకార్యంలో పాల్గొంటారు. సహోద్యోగుల తప్పిదాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రుణయత్నం ఫలించిధనం అందుతుంది. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
మకరం :- వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు. కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు వాయిదాపడతాయి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి.
కుంభం :- ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. బ్యాకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.
మీనం :- టెక్నికల్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఇతర దేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రింటింగ్ రంగాలలో వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.