Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-05-2023 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల శుభం

Webdunia
మంగళవారం, 16 మే 2023 (04:00 IST)
మేషం :- స్త్రీల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు చేజారిపోయేందుకు ఆస్కారం ఉంది. దూరపు బంధువుల రాక మిమ్ములను సందిగ్ధంలో పడవేస్తుంది. సంఘంలో పలుకుబడి కల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది.
 
వృషభం :- ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థల సిబ్బందికి ఒత్తిడి, శ్రమ అధికమవుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఏ పని మొదలెట్టినా అసంపూర్ణంగా ముగించవలసివస్తుంది. రవాణా రంగాల వారికి ప్రయాణీకుతో చికాకులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. 
 
మిథునం :- మీ సంతానం పై చదువుల కోసం పొదుపు పథకాలు చేపడతారు. ప్రయత్నపూర్వకంగా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలపై బంధువులు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
కర్కాటకం :- బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం అందకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులెదురవుతాయి.
 
సింహం :- విందులలో పరిమితి పాటించండి. రాజకీయాల్లోని వారికి విరోధుల వల్ల ఒత్తిడి, ఆందోళన తప్పదు. సిమెంటు రంగాలలోనివారికి, ఇసుక వ్యాపారస్తులు సత్ఫలితాలు పొందుతారు. పత్రికా రంగంలోని వారి ఏమరుపాటు వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.
 
కన్య :- స్త్రీలకు కళ్ళు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమదాయకంకాదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
తుల :- హామీలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీ ఆశయ సాధనకు బంధువుల సహకారం లభిస్తుంది. బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
 
వృశ్చికం :- ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. బంధు మిత్రులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. చిన్న చిన్న విధులను సైతంఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పొల్గొంటారు.
 
ధనస్సు :- పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక, విద్యుత్ వంటి సమస్యలు తప్పవు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. అధికారులకు మీ సమర్థతపై నమ్మకం తగ్గుతుంది. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు.
 
మకరం :- స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. రిప్రజెంటేటివ్‌లకు, ఏజెంట్లకు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
కుంభం :- రాజకీయనాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. మీ పెద్దల ఆరోగ్య విషయంలో మెలకువ వహించండి. రావలసిన ధనం వసూలుకై అధిక శ్రమను ఎదుర్కొంటారు.
 
మీనం :- కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. రాజకీయనాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments