Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-05-2023 ఆదివారం రాశిఫలాలు - హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తే...

Advertiesment
astro6
, ఆదివారం, 14 మే 2023 (04:04 IST)
మేషం :- దైవకార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావటం మంచిది. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.
 
వృషభం :- భాగస్వామిక ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. మీ ఉన్నతిని చాటుకోవటానకి ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది.
 
మిథునం :- వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాల్లో చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. నిరుద్యోగులకు ప్రయత్న పూర్వకంగా సదావకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. బంధుమిత్రులు మిమ్ములను గురించి అపోహపడే ఆస్కారం ఉంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
సింహం :- ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు.
 
కన్య :- వస్త్ర, బంగారం, వెండి, రత్నవ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, నగదు అవార్డు వంటి శుభ సంకేతాలున్నాయి. స్త్రీలకు అయిన వారి నుంచి ఆదరణ లభిస్తుంది.
 
తుల :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరని గమనించండి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. సోదరీ సోదరుల నుంచి చికాకులు అధికమవుతాయి. ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు.
 
వృశ్చికం :- సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఖర్చులు పెరగటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలు శుభకార్యాల్లో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
ధనస్సు :- దైవ దర్శనాల్లో పాల్గొంటారు. సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటింబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం ఆహార, ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
మకరం :- చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తిపెరుగుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువుల చేజారిపోతాయి. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. రచన, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ సంతానం విదేశీ చదువుల విషయంలోఒక నిర్ణయానికి వస్తారు.
 
కుంభం :- దంపతుల మధ్య అన్యోన్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. ఏసీ కూలర్లు మెకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానవచ్చును. సంఘంలో మీ మాటకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయనాయకులు యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
మీనం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. విందులలో పరిమితి పాటించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-05-2023 నుంచి 20-05-2023 వరకు మీ వార రాశిఫలాలు