Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-05-2023 శనివారం రాశిఫలాలు - అభయ ఆంజనేయస్వామిని తమలపాకులతో...

Advertiesment
astro5
, శనివారం, 13 మే 2023 (04:00 IST)
మేషం :- వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణల కోసం చేసే యత్నాలు క్రమంగా సత్ఫలితాలనిస్తాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మొహమ్మాటాలకు పోయి దుబారా ఖర్చులు చేయకండి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.
 
వృషభం :- రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులకు ఆశాజనకం. ఉన్నతస్థాయి అధికారులు ధన ప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీలు వాహనం నడుపుతున్నపుడు, నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్నతరహా, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మిథునం :- ప్రైవేట్ విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి అధికం వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయాలో జాగ్రత్త వహించండి.
 
కర్కాటకం :- అకాల భోజనం, శ్రమాధిక్యతల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులౌతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి లౌక్యం అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
సింహం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పెరుగుతుంది. ఖర్చులు అధికం కావటంతో చేబదుళ్ళు తప్పవు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటాయి. భాగస్వామిక, సొంత వ్యాపారాలు ప్రగతి పథంలో నడుస్తాయి.
 
కన్య :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రముఖులను కలుసుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.
 
తుల :- ఉద్యోగస్తులు మార్పులకై చేయు యత్నాలు ఒక కొలిక్కిరాగలవు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు ఆడంబరాలు, విలాసాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నాలు కలిసిరావు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
 
వృశ్చికం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అన్ని విధాలా కలసిరాగలదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
ధనస్సు :- ఆర్థికంగా ఒక అడుగు ముందుకేస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. బంధువుల రాకపోకలు అధికం కాగలవు. దూరప్రయాణాల్లో మెలకువ వహించండి.
 
మకరం :- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు, శ్రమ అధికం. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులతో మెళుకువ అవసరం.
 
కుంభం :- వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి శుభదాయకం. రావలసిన ధనం అందటంతో పొదుపుదిశగా మీ ఆలోచన లుంటాయి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. నిరుద్యోగులకు సదావకాశాలు చేజారిపోతాయి. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు.
 
మీనం :- గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన చాలా అవసరం. చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-05-2023 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభం...