Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-01-2025 సోమవారం దినఫలితాలు : విలాసాలకు విపరీతంగా ఖర్చు...

రామన్
సోమవారం, 13 జనవరి 2025 (04:07 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
స్నేహసంబంధాలు బలపడతాయి. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. కొత్త పనులు చేపడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చెల్లింపుల్లో జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు విపరీతం. ఆప్తుల సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పిల్లల దూకుడు అదుపుచేయండి. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి ఫలిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాక్‌పటిమతో నెట్టుకొస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు, ధైర్యంగా ముందుకు సాగుతారు. కష్టమనుకున్న పనులు సానుకూలమవుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గుట్టుగా మెలగండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఆర్థికపరంగా మంచి ఫలితాలున్నాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కారక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన లభిస్తుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యులు ఉద్రేకపరుస్తాయి. సామరస్యంగా మెలగండి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలేసి వెళ్లకండి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. వేడుకను ఘనంగా చేస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి!

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

ముక్కోటి ఏకాదశి : ఏకాదశి వ్రతంతో పుణ్యఫలం.. విష్ణు సహస్రనామాన్ని చదివినా.. విన్నా...?

10-01-2025 శుక్రవారం దినఫలితాలు : అవకాశాలను చేజిక్కించుకుంటారు...

ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం, విశిష్టత ఏమిటి?

09-01-2025 గురువారం దినఫలితాలు : ఆ రాశివారికి పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది....

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

తర్వాతి కథనం
Show comments