Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-02-2025 బుధవారం రాశిఫలాలు - లక్ష్యాన్ని సాధిస్తారు.. మీ నమ్మకం ఫలిస్తుంది...

రామన్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. ఆహ్వానం అందుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాలు జాగ్రత్త. శుభకార్యంలో పాల్గొంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. అదృష్టయోగం మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలు మెదలెడతారు. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. బంధువులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితలను సంప్రదిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రధాన అంశాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్నవిషయానికే ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం అవసరాలు అతికష్టం మీద తీరుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. వేడుకకు హాజరుకాలేరు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పురస్కారం అందుకుంటారు. ఖర్చులు అధికం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం, కీలకపత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా అడుగులేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. పనులు వాయిదా వేసుకుంటారు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ధైర్యంగా యత్నాలు సాగించండి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణం విరమించుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వస్త్రప్రాప్తి వాహనయోగం ఉన్నాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సేవాసంస్థలకు సాయం అందిస్తారు. తలపెట్టిన పనులు హడావుడిగా సాగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

అన్నీ చూడండి

లేటెస్ట్

ప్రదోష కాలంలో తులసి, కొబ్బరి నీళ్లు శివునికి ఇవ్వకూడదట!

10-02-2025 సోమవారం రాశిఫలాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

09-02-2025 ఆదివారం దినఫలితాలు- ధనలాభం పొందుతారు

09-02-2025 నుంచి 15-02-2025 వరకు ఫలితాలు.. అపజయాలకు కుంగిపోవద్దు..

08-02-2025 శనివారం దినఫలితాలు- పొగిడే వ్యక్తులను నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments