Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-02- 2025 శుక్రవారం రాశి ఫలాలు : ఎవరినీ అతిగా నమ్మవద్దు...

Advertiesment
astro3

రామన్

, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. పనులు నిరాటంకంగా సాగుతాయి. కాత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అవసరాలకు ధనం అందుతుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యం చేరువలోనే ఉంది. మనోధైర్యంతో మెలగండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు అధికం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బంధువులతో సంభాషిస్తారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వేడుకకు హాజరుకాలేరు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. మనోధైర్యంతో మెలగండి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. మీ సమర్ధతపై ఎదుటివారికి గురికుదురుతుంది. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు. పరిచయాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పనులు మందుకు సాగవు. పత్రాలు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీరు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. పరిచయాలు బలపడతాయి. నూతన యత్నాలు, పనులు ప్రారంభిస్తారు. ప్రతి విషయం స్వయంగా చూసుకోండి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. దంపతుల మధ్య అవగాహన లోపం.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. స్థిరాస్తుల వ్యవహారంలో మెళకువ వహించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రికార్డ్ స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. వరుసగా 35 మాసాలు వంద కోట్ల మార్క్