మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. ప్రయాణం విరమించుకుంటారు. అపరిచితులతో మితంగా సంభాషించండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు సామాన్యం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. అనవసర జోక్యం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నోటీసులు అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతల అధికం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. అందరితోను మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. శుభకార్యానికి హాజరవుతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దంపతల మధ్య సఖ్యతలోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ప్రియతములతో సంభాషిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఇంటి పనులతో తీరిక ఉండదు. ఆదాయానికి తగ్గట్టగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. అప్రియమైన వార్త వినవలసిన వస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుతుంది. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. కీలక వ్యవహారాలతో తలమునకలవుతారు. పట్టుదలకు పోయి అవకాశాలను చేజార్చుకుంటారు. విందులకు హాజరవుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితులతో కాలక్షేపూం చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. నోటీసులు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆప్తులను కలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ప్రయాణం సజావుగా సాగుతుంది.