Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-02-2025 సోమవారం రాశిఫలాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

Advertiesment
astro4

రామన్

, సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగవు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం పొందుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో సతమతమవుతారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. బంధువులతో విభేదాలు, దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆలోచనలతో సతమతమవుతారు. సంప్రదింపులు ఫలించవు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త పనులు మొదలెడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహనిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
స్థిరాస్తి ధనం అందుతుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ జోక్యం అనివార్యం. ఖర్చులు సామాన్యం. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణంలో కొత్తవారితో జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పం నెరవేరుతుంది. మాట నిలబెట్టుకుంటారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
దుబారా ఖర్చులు విపరీతం. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. పెద్దల వ్యాఖ్యలు ఉపశనం కలిగిస్తాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. పనులు మందకొడిగా సాగుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
తలపెట్టిన కార్యం విజయవంతవుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ధనలాభం ఉంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-02-2025 ఆదివారం దినఫలితాలు- ధనలాభం పొందుతారు