Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-07-2023 మంగళవారం రాశిఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (04:00 IST)
మేషం :- బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. బ్యాంకింగ్ అధికారులతో సంభాషిచేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. ఇతరులకు సహాయ సహకారాలు అందించుట వలన మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం :- స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. చేయనియత్నాలకు ప్రతిఫలం ఆశించకండి. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కళ, క్రీడ, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి.
 
మిథునం :- కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచి ఎదుటివారితత్వన్ని గమనించండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం :- స్త్రీలు వస్త్ర, ఆభరణాల పట్ల ఆసక్తి వ్యవహరిస్తారు. కొంత మంది మీ నుండి విషయాలు రాచట్టటానికి యత్నిస్తారు. గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
సింహం :- ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మెరుగుపడతాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. ధనాన్ని మంచి నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య ప్రేమాను రాగాలు బలపడతాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో పాల్గొంటారు.
 
కన్య :- ఉద్యోగస్తులు సమర్ధవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. మీ దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించటం మంచిది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
తుల :- కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యపకాలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రాజకీయాలలోని వారు ప్రత్యర్థులతో మాటపడక తప్పదు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడతారు.
 
వృశ్చికం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యుల సమాచారం అందుతుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండట మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజకరంగా ఉంటాయి. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసివచ్చేకాలం. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యపకాలు అధికమవుతాయి.
 
ధనస్సు :- మీ సంతానం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిది కాదు అని గమనించండి. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి.
 
మకరం :- ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. దంపతుల మధ్య నూతన విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితంగా ఉంటుంది.
 
కుంభం :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. చిన్నతరహా, చిరువృత్తుల వారికిసరైన తృప్తి లభిస్తుంది. దైరకార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. మొండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి.
 
మీనం :- వైద్య, శాస్త్ర, వాణిజ్య రంగాల వారికి శుభదాయకం. నిరుద్యోగుల యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కుంటారు. సిమెంట్, ఐరన్, రంగాల్లో వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హమాస్ కమాండ్ కంట్రోల్‌ ఆస్పత్రిలో దాడి.. 43 మంది మృతి

ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు

పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా? తమ్మినేని సీతారాం (Video)

ఏపీ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్

పెళ్లి విందు వడ్డించడంలో ఆలస్యం... వివాహాన్ని రద్దు చేసుకున్న వరుడు...

అన్నీ చూడండి

లేటెస్ట్

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

27-12-2024 శుక్రవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

26-12-2024 గురువారం దినఫలితాలు : విలాసాలకు వ్యయం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments