Webdunia - Bharat's app for daily news and videos

Install App

Today Astrology మంగళవారం రాశిఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

రామన్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (04:00 IST)
Daily Astrology మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. కొత్త వ్యక్తులతో సమస్యలెదురవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. అపరిచితులతో జాగ్రత్త. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆర్థికలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వేడుకకు హజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రణాళికలు వేసుకుంటారు. ధనసహాయం తగదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణసమస్యలతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు పురమాయించవద్దు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. మీ సిఫార్సుతో ఒకరికి మేలు జరుగుతుతుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు.. ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. కొత్త సమస్యలెదురవుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
ధనస్సు :  మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. అయిన వారికి సాయం అందిస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రతికూలతలు అధికం. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఏకాద్రగతతో వాహనం నడపండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
దుబారా ఖర్చులు విపరీతం. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు అనుభవజ్ఞులను సంప్రదించండి.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే 'వన్ నేషన్ - వన్ ఎలక్షన్'

రాజ్యసభ సీటు స్థానంలో మంత్రి పదవి... ఎందుకిచ్చారో తెలుసా?

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఇకలేరు..

Minister Post to Nagababu ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!!

Baby Girl: ఆడపిల్ల పుట్టిందని పండగ చేసుకున్న తండ్రి.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Today Astrology ఆదివారం దినఫలితాలు - స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు....

Astami on Sunday : ఆదివారం వచ్చే అష్టమి ఏం చేయాలంటే?

Weekly Horoscope for All Zodiac Signs 08-12-2024 నుంచి 14-12-2024 వరకు వార ఫలితాలు

Today Horoscope (07-12-2024) శనివారం దినఫలితాలు - ప్రయాణంలో అపరిచితులతో జాగ్రత్త...

Daily Astrology శుక్రవారం ఫలితాలు - ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి...

తర్వాతి కథనం
Show comments