Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Daily Astrology శుక్రవారం ఫలితాలు - ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి...

Advertiesment
horoscope

రామన్

, శుక్రవారం, 6 డిశెంబరు 2024 (04:00 IST)
Daily Astrology  మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కీలక చర్చల్లో పాల్గొంటారు. వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు స్థిమితంగా పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ జోక్యం అనివార్యం. వివాదాలు సద్దుమణుగుతాయి. వేడుకకు హాజరవుతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. అనవసర జోక్యం తగదు. పాతమిత్రులు తారసపడతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ధైర్యంగా యత్నాలు కొనసాగించండి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆప్తుల కలయిక వీలుపడదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పనులు పురమాయించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు అధికం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. కొత్త యత్నాలు మెదలేడతారు. పత్రాలు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
దృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంభాషిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. చేసిన పనులే చేయవవలసి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిపెడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
రుణ సమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-12-2024 గురువారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగించండి...