Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

03-12-2024 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. జాగ్రత్త

Astrology

రామన్

, మంగళవారం, 3 డిశెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. అనవసర జోక్యం తగదు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు పురమాయించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులను సంప్రదిస్తారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ధైర్యంగా యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. విమర్శలు పట్టించుకోవద్దు. మీ సామార్థ్యంపై నమ్మకం పెంచుకోండి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిసారిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ వ్యవహారాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమయస్ఫూర్తిగా మెలగాలి. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఖర్చులు సామాన్యం. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పనులు అర్థాంతగా ముగించవలసి వస్తుంది. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. విలాసాలకు వ్యయం చేస్తారు. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా తీసుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ప్రియతముల వ్యాఖ్యలు కార్మోన్యుఖులను చేస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేస్తే అంతే సంగతులు.. టీటీడీ