Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Today Horoscope (07-12-2024) శనివారం దినఫలితాలు - ప్రయాణంలో అపరిచితులతో జాగ్రత్త...

horoscope

రామన్

, శనివారం, 7 డిశెంబరు 2024 (04:00 IST)
Today Horoscope మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పనుల సానుకూలతకు ఓర్పుతో శ్రమిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ప్రయాణంలో అపరిచితులతో జాగ్రత్త. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మీ జోక్యం అనివార్యం. మీ సలహా అందరికీ ఆమోదయోగ్యమవుతుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాప్యం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏకాగ్రతతో వ్యవహరించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అకారణ కలహం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. యత్నాలకు అదృష్టం కలిసివస్తుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పనులు హడావుడిగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అభియోగాలను ధీటుగా ఎదుర్కుంటారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. మొండిగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ప్రయాణంలో అవస్థలు తప్పవు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వివాదాల జోలికి పోవద్దు. ఖర్చులు అధికం. ఆత్మీయులను కలుసుకుంటారు.. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు చేరువవుతారు. పొగిడేవారి అంతర్యం గ్రహించండి. ధనలాభం ఉంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పాతమిత్రులతో కాలక్షేపం చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Daily Astrology శుక్రవారం ఫలితాలు - ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి...