Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-12-2023 ఆదివారం రాశిఫలాలు - రమాసమేత సత్యనారాయణస్వామిని మీ సంకల్పం సిద్ధిస్తుంది.

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక బ॥ త్రయోదశి తె. 5.32 స్వాతి ఉ.10.41 సా.వ.4.30 ల 6.09. సా.దు. 3.51 ల4.35.
రమాసమేత సత్యనారాయణస్వామిని మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు టీ.వీ కార్యక్రమాల్లో రాణిస్తారు. కుటుంబ వ్యవహరంలో మొహమ్మాటం, ఒత్తిళ్లకు తావివ్వకండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి.
 
వృషభం :- బేకరి, స్వీట్స్, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి. ఆకస్మిక సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. స్త్రీల రచనలు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది.
 
మిథునం :- లౌక్యంగా మెలిగి పనులు చక్కబెట్టుకుంటారు. మార్కెట్ రంగాల వారికి, ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు ఏజెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరగలదు. ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, కానుకలు అందజేస్తారు. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను గుర్తిస్తారు. 
 
కర్కాటకం :- బేకరి, స్వీట్స్, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి. దూర ప్రయాణాలలో అనుకూలత, కొత్త అనుభూతికి లోనవుతారు. దుబారా ఖర్చులు అదుపు చేయగల్గుతారు. ఉద్యోగస్తులు సమావేశాలు, విందులలో పాల్గొంటారు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
సింహం :- విదేశీయానం కోసం చేసే యత్నాలలో ఆటంకాలు తొలగిపోయి. ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులెదురైనా రావలసిన ధనం అందటంతో కుదుటపడతారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. విద్యార్థులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
 
కన్య :- ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ఆశించినంత సంతృప్తినీయజాలవు. మొండి బాకీలు వసూలు కాగలవు. మీ ప్రమేయంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. కష్టసమయంలో అయిన వారికి అండగా ఉంటారు. మీ శ్రీమతి వైఖరి మరింత చికాకుపరుస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
తుల :- మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. పత్రికా, పారిశ్రామిక సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. బంధువుల ఆకస్మిక రాక వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అరియర్స్ మంజూరవుతాయి.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఆత్మీయులతో కలసి విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు బరువు, బాధ్యతలకు అధికమవుతాయి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసివస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రధాన కంపెనీల షేర్ల విలువలు తగ్గే సూచనలున్నాయి.
 
మకరం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అయిన వారే సాయం చేసేందుకు సందేహిస్తారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళుకువ అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
కుంభం :- రాజకీయ నాయకులుకు ప్రయాణాలలో మెళుకువ అసవరం. వ్యవహరాల్లో ఖచ్చితంగా ఉండాలి. గుట్టుగా యత్నాలు సాగించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. పనులు అనుక్ను విధంగా సాగవు. మొహమ్మాటాలకు పోయి ఇబ్బందులెదుర్కుంటారు.
 
మీనం :- సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులుమీ స్తోమతుకు తగినట్టే ఉంటాయి. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. కీలకమైన వ్యవహరాల్లో తీసుకున్న నిర్ణయాలవల్ల కష్టనష్టాలు ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Musi: తెలంగాణలో భారీ వర్షాలు - మూసీ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తేస్తే పరిస్థితి?

Lord Vitthal snake: పాము దర్శనంలో విట్టల్ దర్శనం.. వీడియో వైరల్

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఉప్పొంగిన మూసీ నటి- నీట మునిగిన ప్రాంతాలు (video)

Drama and Lies: పాక్ ప్రధాని డ్రామాలొద్దు.. అద్దంలో చూసుకుంటే నిజ స్వరూపం తెలిసిపోద్ది.. భారత్ ఫైర్

Heavy rains: బంగాళాఖాతంలో తుఫాను- ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Wedding Day: వివాహం జరుగుతుండగా.. వర్షం పడితే మంచిదేనా?

TTD: ఒంటిమిట్టలో ప్రపంచంలోనే ఎత్తైన 600 అడుగుల శ్రీరామ విగ్రహం

25-09-2025 గురువారం ఫలితాలు - పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

36 Lakh Laddus : ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులు- 36 లక్షల లడ్డూల తయారీ

తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు భారత్‌లో తొలి ఏఐ కమాండ్ సెంటర్

తర్వాతి కథనం
Show comments