Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

08-12-2023 శుక్రవారం దినఫలాలు - అష్టలక్ష్మీని పూజించిన శుభం, జయం...

Weekly Horoscope
, శుక్రవారం, 8 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక బ॥ ఏకాదశి తె.4.01 హస్త ఉ.7.24 సా.వ.4.01 ల 5.44.
 
ఉ.దు. 8. 29 ల 9.13 పు. దు. 12.10 ల 12.54. అష్టలక్ష్మీని పూజించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- ఆలయ సందర్శనాల కోసం దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. అయిన వారు మీ నుంచి ధనసహాయం ఆశిస్తారు. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 
 
వృషభం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. స్త్రీలకు అయిన వారినుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిదికాదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం.
 
మిథునం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం :- వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ఏమంత సంతృప్తికరంగా సాగవు. ఉద్యోగస్తులకు పై అధికారులు నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. 
 
సింహం :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శనలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువులతో కలిసి వేడుకలు, విందులలో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది.
 
కన్య :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారవల్ల నష్టపోవలసి వస్తుంది. విలాసాలకు ధనంబాగుగా వ్యయం చేస్తారు. బంధువులతో పట్టింపులు, చికాకులు ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
తుల :- బంధువుల రాకతోఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వృత్తిపరమైన ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతోముఖ్యం. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం.
 
వృశ్చికం :- వృత్తి వ్యాపారులు ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది.
 
ధనస్సు :- సంతానం విద్యా విషయాలు, కళత్ర ఆరోగ్యంలో ఆందోళన తప్పదు. మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. కుటుంబీకులతో కలసి వేడుకలలో పాల్గొంటారు. ఓర్పు, నేర్పు, అంకితభావంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.
 
మకరం :– మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏదన్నా అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. కాంట్రాక్టర్లు నూతన అవకావాలు లభిస్తాయి. తొందరపాటుతనం వల్ల ఇబ్బందుల్లో పడే ఆస్కారం ఉంది.
 
కుంభం :- స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. బంధు మిత్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు.
 
మీనం :- వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. వాహనం ఏకాగ్రతతో నడపాలి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రాజకీయనాకులకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-12-2023 గురువారం దినఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన సంకల్పం