Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-12-2023 గురువారం దినఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన సంకల్పం

Astrology
, గురువారం, 7 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక ఐ|| దశమి రా.2.33 హస్త పూర్తి ప.వ.2.17 ల 4.03. ఉ.దు. 10.01 ల 10.45 పు.దు. 2.25ల3.09.
 
సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచిసహకారం లభిస్తుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
వృషభం :- ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. రావలసిన ధనం వాయిదా పడటంతో ఒకింత ఆందోళన చెందుతారు. విద్యార్థులకు తోటి వారి వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళుకువ వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుటమంచిది.
 
మిథునం :- మీ లక్ష్య సాధనకు నిరంతరం కృషి, పట్టుదల అవసరమని గమనించండి. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెళుకువ వహించండి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళుకువ అవసరం. దంపతుల మధ్యకలహాలు తలెత్తుతాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
 
కర్కాటకం :- ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసివస్తుంది. నేడు చేద్దామన్న పనులు రేపటి వాయిదా వేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. హోటల్, క్యాటరింగ్ రంగాలవారికి లాభదాయకం.
 
సింహం :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ప్రింటింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రావలసిన ధనం అందడంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది.
 
కన్య :- కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు సంతృప్తికరంగా సాగుతాయి. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విదేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు.
 
తుల :- మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. రియల్ఎస్టేట్ రంగాల వారికి నూతనవెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి, చికాకులు తప్పవు. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. పరిచయాలేర్పడతాయి.
 
ధనస్సు :- అవకాశవాదులు అధికం కావడంవల్ల ఊహించని ఒత్తిడికి లోనవుతారు. బంధువుల మధ్య అపోహలు తొలగిపోయి ఆప్యాయతలు మరింత బలపడతాయి. స్త్రీలకు పనివారాలతో చికాకులు తప్పవు. పాత మిత్రుల నుండి ఆహ్వానాలు, లేఖలు అందుకుంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
మకరం :- వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. పత్రిక, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆత్మీయులను విమర్శించుట వలన చికాకులను ఎదుర్కొంటారు.
 
కుంభం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం చేతి కందుతుంది. వచ్చిన సొమ్మును పొదుపు పథకాల వైపు మళ్ళించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నమ్మకం పట్టుదలతో యత్నాలు సాధించండి, సత్ఫలితాలు పొందుతారు. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు.
 
మీనం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. స్త్రీలు వాక్చాతుర్యముతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒక్కోసారిమంచి చేసినా విమర్శలు తప్పవు. దూర ప్రయాణాల్లో వస్తువులు జారవిడుచుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-12-2023 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి...