Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-05-2023 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం...

Webdunia
బుధవారం, 10 మే 2023 (04:00 IST)
మేషం :- ధనవ్యయం విపరీతంగా ఉన్నా ప్రయోజనం, సార్థకత ఉంటాయి. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది అప్రమత్తత అవసరం. మీ యత్నాలకు కొంతమంది భంగం కలిగించవచ్చు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి.
 
వృషభం :- ట్రాన్సుపోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూల మవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం.
 
మిథునం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏజెంట్లకు, రిప్రజెంటేవ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
కర్కాటకం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది అప్రమత్తత అవసరం. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
సింహం :- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ప్రముఖుల కలయిక, బ్యాంకు వ్యవహరాలు ఒక పట్టాన పూర్తి కావు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
తుల :- సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ఏజెంట్లకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. క్రీడలపట్ల నూతన ఉత్సాహం కానవస్తుంది.
 
వృశ్చికం :- మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీల ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది.
 
ధనస్సు :- బంధు మిత్రలతో విభేదాలు తీరతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రియల్ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిదికాదని గమనించండి.
 
మకరం :- విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం :- బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. బందువుల రాకతో కుటుంబంలో ఉల్లాసం, సంతోషం కానవస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం :- ఉద్యోగస్తులకు తోటివారి సహాయం లభించక ఆందోళన చెందుతారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వాహనచోదకులకు మెళకువ అవసరం. మీ కార్యక్రమాలు బంధువుల రాకతో మార్చుకోవలసి ఉంటుంది. మీ జీవితభాగస్వామి వైఖరి చికాకు కలిగిస్తుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

Sravana Masam: శ్రావణ మాసం ప్రారంభం.. శుక్రవారం రోజున తామర పూలతో మాలను అమ్మవారికి?

25-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

24-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల దూకుడు అదుపు చేయండి...

తర్వాతి కథనం
Show comments