Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-03-2025 సోమవారం రాశిఫలాలు - రుణ విముక్తులవుతారు - ఖర్చులు సామాన్యం...

రామన్
సోమవారం, 10 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. అనుకోని సంఘటనలెదురవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. దంపతులు ఏకాభిప్రాయం నెలకొంటుంది. ప్రయాణం తలపెడతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆత్మీయులతో సంభాషిస్తారు. ముందుచూపుతో నిర్ణయం తీసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. పెద్దఖర్చు తగిలే అస్కారం ఉంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణ విముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. స్థిరాస్తి వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పనులు పురమాయించవద్దు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ దృష్టి మరల్చేందుకు కొందరు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. మీ చొరవతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. విలువైన వస్తువులు మరమ్మతకు గురవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. సమర్ధతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మొండిబాకీలు వసూలవుతాయి. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ ఉన్నతి కొందరికి అపోహకలిగిస్తుంది. విమర్శలు, కొత్త పనులు మొదలెడతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం. పనులు, పురమాయించవద్దు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని ఏమరుపాటుగా వదిలి వెళ్లకండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఖర్చులు సామాన్యం. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments