మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి. సాయం అర్థించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆహ్వానం అందుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొత్త యత్నాలు మొదలెడతారు. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికాకుండా మెలగండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. తాకట్టు విడిపించుకుంటారు. మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సామాన్యం. పాతమిత్రులను కలుసుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త పనులు మొదలు పెడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. మీ వ్యాఖ్యలు అపార్థాలకు దారితీస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మాట నిలబెట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వేడుకలో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరే వరకు శ్రమించండి. అపజయాలకు కుంగిపోవద్దు. దుబారా ఖర్చులు విపరీతం.. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తీసుకురావద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. లావాదేవీలతో సతమతమవుతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ శ్రీమతిలో మార్పువస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కష్టమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆలయాలు సందర్శిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. ఆత్యీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏకాగ్రతతో శ్రమించండి. ఇతరులను తప్పుపట్టవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం ముఖ్యం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ధైర్యంగా అడుగు ముందుకేయండి. అనుమానాలకు తావివ్వవద్దు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఏకాగ్రతతో వాహనం నడపండి.