Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-03-2025 బుధవారం దినఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు...

Advertiesment
Makara rashi

రామన్

, బుధవారం, 5 మార్చి 2025 (04:07 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
స్థిరాస్తి ధనం అందుతుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఖర్చులు విపరీతం. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. పనులు ముందుకు సాగవు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ధనసహాయం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. వేడుకకు హాజరవుతారు. వివాదాలు కొలిక్కివవస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆచితూచి అడుగేయండి. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటననలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పధంతో మెలగండి. అపోహలకు తావివ్వవద్దు. ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
చర్చలు ఫలిస్తాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వేడుకను ఘనంగా చేస్తారు. చెల్లింపులు, నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఖర్చులు అదుపులో ఉండవు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అందరితోనూ మితంగా సంభాషించండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. వేగవంతమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతకు గురవుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాల్లో తొందరపాటు తగదు. అననుభవజ్ఞులను సంప్రదించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. చేసిన పనులే చేయవలసి వస్తుంది. పత్రాలు అందుకుంటారు. శుభకార్యంలో పాల్గొంటారు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చిన్న విషయానికే చికాకుపడతారు. ఎవరినీ నిందించవద్దు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు, కీలక పత్రాలు అందుతాయి. ప్రయాణంలో ఒకింత అవస్థలెదుర్కుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-03-2025 మంగళవారం దినఫలితాలు - ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు...