Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-11-2022 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన..

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక లావాదేవీలందు సంతృప్తి. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారముంది. దూరప్రాంతాల నుంచి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
 
వృషభం :- ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
మిథునం :- చెప్పుడు మాటలకు ప్రాధాన్యత నివ్వటం మంచిది కాదు. వ్యవహార, ఒప్పందాల్లో తొందరపాటు తగదు. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్య విషయంలో సత్వరం స్పందిస్తారు. అప్పుడప్పుడు మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి.
 
కర్కాటకం :- చేపట్టిన పనులు ఏమాత్రం ముందుకు సాగవు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. మీ అవసరాలకు కావలసిన ధనం ఆత్మీయుల ద్వారా సర్దుబాటు కాగలదు. సొంత వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
 
సింహం :- ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు కొత్త వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. బంధువులను కలుసుకుంటారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికం, ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ లక్ష్యం నెరవేరదు.
 
కన్య :- ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలలో కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం కలదు. వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ప్రారంభంలోని చికాకులు క్రమేపీ తొలగుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల పరిస్థితులు కానవసాయి.
 
తుల :- వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. మీ మాటకు ఇంటాబయటా ఆదరణ పెరుగుతుంది. స్త్రీలపై శకునాలు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి.
 
వృశ్చికం :- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ప్లీడర్లకు, వైద్యరంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
ధనస్సు :- దంపతుల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుంది. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో లాభాలను అందు కుంటారు. స్త్రీలకు ఒత్తిడి, పనిభారం అధికం కావడంవల్ల కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు.
 
మకరం :- వన సమారాధనలు వేడుకల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రయాణాలు, బ్యాంకు పనులు ఆశించినంత చురుకుగా సాగవు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆత్మీయుల సాయంతో ఒక సమస్యను అధిగమిస్తారు.
 
కుంభం :- ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రాజకీయవర్గాల వారికి విదేశీ పర్యటనలు తప్పవు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులను ఎదుర్కొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని అనుకున్న పనులు పూర్తి కావు.
 
మీనం :- బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, ఆకస్మిక స్థాన చలనం సంభవం. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడి కోసం యత్నాలు సాగిస్తారు. దైవ దర్శనాల్లో చికాకు లెదుర్కుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments