Webdunia - Bharat's app for daily news and videos

Install App

02-03- 2025 ఆదివారం రాశిఫలితాలు - ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

రామన్
ఆదివారం, 2 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోను రాజీపడదు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పనులు మధ్యలో ఆపివేయొద్దు. అనవసర జోక్యం తగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావహదృక్పధంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆహ్వానం అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పనులు మధ్యలో నిలిపివేయొద్దు. ముఖ్యులతో సంభాషిస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలు కొలిక్కివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వేడుకకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణసమస్యలు తొలగి తాకట్టు విడిపించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఖర్చులు సామాన్యం. పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికాబద్ధంగా శ్రమించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు అధికం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Women's Day: 100,000 మంది మహిళలతో భారీ ర్యాలీ.. కొత్త సంక్షేమ పథకాల ప్రారంభం

Nadendla Manohar: పవన్‌ను దూషిస్తే హీరోలు కారు జీరోలవుతారు.. నోటికొచ్చినట్లు మాట్లాడితే?: నాదెండ్ల

సినీ ఫక్కీలో.. ప్రియుడితో జంప్ అయిన వివాహిత.. భర్తను చూసి రన్నింగ్ బస్సులో పరార్ (video)

ఆత్మహత్య చేసుకుంటే ప్రియురాలు ఒంటరిదైపోతుందని...

Posani: పోసానికి ఛాతీ నొప్పి వచ్చిందా? సీఐ వెంకటేశ్వర్లు ఏమన్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం సాయంత్రం భార్యకు భర్త మల్లెపువ్వులు, స్వీట్లు కొనిపెడితే.. ఏం జరుగుతుంది?

28-02- 2025 శుక్రవారం రాశిఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

27-02- 2025 గురువారం దినఫలితాలు - పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Maha Shivratri 2025: శివుడికి పసుపు ఆవాలు సమర్పిస్తే.. ఏం జరుగుతుంది?

తెలుగు రాష్ట్రాలలో మహా శివరాత్రి వేడుకలు- ప్రయాగ్‌రాజ్‌లో ఇసుక రాలనంత జనం (video)

తర్వాతి కథనం
Show comments