Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

రామన్
గురువారం, 1 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యం సాధిస్తారు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పత్రాలు అందుకుంటారు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మానసికంగా కుదుటపడతారు. అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత ఉంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. ఆర్థికలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. శుభకార్యానికి హజరవుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రణాళికలు వేసుకుంటారు. ధనసహాయం తగదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
రుణసమస్యలతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితులతో సంభాషిస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు, వాయిదా వేసుకుంటారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పనులు పురమాయించవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. దుబారా ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. అయిన వారికి సాయం అందిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఇరకాటానికి గురిచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రతికూలతలు అధికం. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. రుణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తెలియని వెలితి వెన్నాడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనులు వాయిదా పడతాయి. వ్యవహారాల్లో ఒత్తిళ్లకు లొంగవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. ఏకాగ్రతతో వాహనం నడపండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

లేటెస్ట్

28-04-2025 సోమవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

తర్వాతి కథనం
Show comments