Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

Advertiesment
Horoscope nakshatra

రామన్

, మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. ఖర్చులు సామాన్యం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. శుభకార్యానికి హాజరుకాలేరు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు సానుకూలమవుతాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. పాత పరిచయస్తులు తారసపడతారు. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పనులు వేగవంతమవుతాయి. లావాదేవీల్లో మెళకువ వహించండి. ఖర్చులు అధికం. ప్రముఖులతో సంభాషిస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కృషి ఫలించకున్నా కుంగిపోవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. పరిస్థితులు పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అప్రియమైన వార్త వింటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పబలం కార్యోన్ముఖులను చేస్తుంది. లక్ష్యం సాధించే వరకు శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆప్తులతో సంభాషిస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. వాహనం కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. అతిగా ఆలోచింపవద్దు. ప్రియతములను కలుసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణ విముక్తులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు సామాన్యం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం. భేషజాలకు పోయి విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అవగాహనలోపం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-04-2025 సోమవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...