Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

Advertiesment
daily astrology

రామన్

, శనివారం, 26 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. పరిచయాలు బలపడతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ధనసహాయం తగదు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యవహారాలతో తీరిక ఉండదు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. అన్యమస్కంగా గడుపుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కుంటారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
శుభవార్త వింటారు. కృషి ఫలిస్తుంది. సభ్యత్వం స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దలు ఆశీస్సులు అందుకుంటారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు విపరీతం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో శ్రమించండి. ఆత్మీయుల హితవు మీపై సత్ ప్రభావం చూపుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అధికం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వేడుకకు హాజరవుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆశించిన పదవులు దక్కవు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పూరిచయాలు ఏర్పడతాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. ప్రయాణంలో విలువైన వస్తువులు జాగ్రత్త.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?