Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Advertiesment
Astrology

రామన్

, గురువారం, 24 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్ధికలావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. చేపట్టిన పనులు సాగవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అతిగా ఆలోచింపవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు పురమాయించవద్దు. పాతపరిచయస్తులు తారసపడతారు. ప్రయాణం తలపెడతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం వేరొకరికి లాభిస్తుంది. చీటికిమాటికి చికాకుపడతారు. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. పిల్లల విజయం సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికం. ముఖ్య సమావేశంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మొండిబాకీలు వసూలవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. పనిభారం, అకాలభోజనం. బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు విపరీతం. మీ సలహా కొందరికి ఉపకరిస్తుంది. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పత్రాల రెన్యువల్లో శ్రద్ధ వహించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఊహించని ఖర్చులెదురవుతాయి. ఆపత్సమయంలో ఆప్తులు అదుకుంటారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంది. ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధిచేకూరుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహంచండి. ఒంటెద్దుపోకడ తగదు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. చేపట్టిన పనులు సాగవు. అస్వస్థతకు గురవుతారు. వేడుకకు హాజరుకాలేరు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఖర్చులు విపరీతం. పొదుపునకు ఆస్కారం లేదు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు కొలిక్కివస్తాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చేపట్టిన పనులు సాగవు. చీటికిమాటికి చికాకుపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. శుభకార్యంలో పాల్గొంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...