Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-03-2025 శనివారం రాశిఫలితాలు - పత్రాల రెన్యువల్లో చికాకులెదుర్కుంటారు...

రామన్
శనివారం, 1 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. దుబారా ఖర్చులు విపరీతం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పత్రాల రెన్యువల్లో చికాకులు ఎదుర్కుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మాటతీరు ఆకట్టుకుంటుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా మెలగండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు సామాన్యం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. సోదరులను సంప్రదిస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తగదు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు, ఆలయాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఒక శుభవార్త సంతోషపరుస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంకల్పబలతో లక్ష్యాన్ని సాధిస్తారు. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. కొందరి వ్యాఖ్యులు ఉద్రేకపరుస్తాయి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతోనే కార్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు సాగవు. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలేసి వెళ్లకండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments