Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం (25-05-2021) రాశిఫలితాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించినా...

Webdunia
మంగళవారం, 25 మే 2021 (04:00 IST)
మేషం : ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, తిప్పట తప్పదు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులు తోటివారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమార్గం గోచరిస్తుంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. 
 
వృషభం : వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం మిమ్మలను సందిగ్ధంలో పడేస్తుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. స్త్రీలకు పనిఒత్తిడివల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
మిథునం : కంది, మిర్చి, పసుపు, ధాన్యం, అపరాలు, స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. 
 
కర్కాటకం : పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ప్రింటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడుట వల్ల మాట పడక తప్పదు. స్త్రీలకు అయినవారితో పట్టింపులెదుర్కోవలసి వస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకువేస్తారు. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. 
 
కన్య : ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. ప్రయాణాలు అనుకూలం. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఏంతో ముఖ్యం. 
 
తుల : హోటల్, కేటరింగ్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. క్రయ, విక్రయాలు లాభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మీ మాటకు సర్వత్రా ఆదరణ లభిస్తుంది. 
 
వృశ్చికం : వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు రూపొందిస్తారు. మీ ధైర్య సాహసాలకు, కార్యదీక్షలకు మంచి గుర్తింపు, అభినందనలు లభిస్తాయి. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు. అవివాహితులలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
ధనస్సు : ఎటువంటి క్లిష్ట సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కొంటారు. స్థిరాస్తి అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీల మాటకు మంచి స్పందన లభిస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు శుభదాయకం. 
 
మకరం : ఆదాయ వ్యయాల్లో ప్రణళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కళలు, ఫోటోగ్రఫీ, ఉన్నత విద్యారంగాల వారికి అనుకూలమైన సమయం. కళ, క్రీడా రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ శ్రీమతితో ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ వాహనం ఇతరులకివ్వడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. 
 
కుంభం : పత్రికా సంస్థలోని వారికి చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దైవ, దర్శనాలు, శుభకార్యాల రీత్యా ధనం అధికంగా ఖర్చు చేస్తారు. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. 
 
మీనం : వృత్తిపరంగా ఎదురైనా చికాకులు తొలగిపోగలవు. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments