Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-09-2020 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజిస్తే సర్వదా శుభం

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : కుటుంబీకుల పట్ల ఆసక్తి కనపరుస్తారు. ఒక విచిత్ర కల మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. విద్యార్థులకు దూరప్రదేశాలలో పై చదువులకు అవకాశం లభిస్తుంది. ప్రేమతో అందరికీ దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి. దైవ, సేవ, పుణ్య కార్యాలకు సహాయం చేస్తారు. 
 
వృషభం : ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. పెద్దలతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకండి. హోటల్, తినుబండారాల వ్యాపారులకు సంతృప్తినిస్తాయి. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో ఆదోళన కలిగిస్తుంది. అయినవారి కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. 
 
మిథునం : నిర్మాణాత్మక పనుల్లో సంతృప్తి కానవస్తుంది. సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. 
 
కర్కాటకం : స్త్రీలకు పనివారితో చికాకులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ అభిప్రాయాలకు, ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటివరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సముఖం చేసుకోగలగుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు సామాన్యం. 
 
సింహం : ప్రైవేటు సంస్థలలో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించగలవు. మీ సంతానం ఆరోగ్యం విషయంలో అధికమైన జాగ్రత్త చూపుతారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి తప్పదు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బంధువుల రాక కొంత అసౌకర్యం కలిగిస్తుంది. 
 
కన్య : ఆర్థిక ఒడిదుడుకులు తెలత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. తలపెట్టిన పనుల్లో ఒకింత జాప్యం, చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఎంత శ్రమించనా మీ కార్యదరీక్షకు ఆటంకాలు ఎదురవుతాయి. 
 
తుల : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు ఒత్తిడి పనిభారం అధికమవుతాయి. అధికారులతో మితంగా సంభాషించండి. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆటుపోట్లు తప్పవు. 
 
వృశ్చికం : పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారి తీరును గమనించి ముందుకుసాగండి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల జయం చేకూరుతుంది. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు వంటివి ఎదుర్కొనక తప్పదు. 
 
ధనస్సు : వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వల్ల అభివృద్ధి కానవస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ఆలస్యంగా అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటివి ఉండగలవు. రాజకీయ నేతలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మతిమరుపు కారణంగా ఇబ్బందులెదుర్కొంటారు. 
 
మకరం : గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలమైన కాలం. విద్యార్థినులు ప్రైమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, వేధింపులు అధికమవుతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఎదుటివారి తీరును గమనించి ముందుకుసాగండి. 
 
కుంభం : లిటిగేషన్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. పారిశ్రామిక రంగంలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన అధికమవుతుంది. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. 
 
మీనం : సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. వీసా, పాస్‌పోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

తర్వాతి కథనం
Show comments