Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-09-2020 శుక్రవారం దినఫలాలు - దుర్గాదేవిని పూజిస్తే సర్వదా శుభం

Advertiesment
18-09-2020 శుక్రవారం దినఫలాలు - దుర్గాదేవిని పూజిస్తే సర్వదా శుభం
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి, పురోభివృద్ధి కానరాదు. మీరు అభిమానించే వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయ. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. 
 
మిథునం : పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఉద్యోగస్తులు స్థానచలనానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. 
 
మిథునం : వైద్య విద్యా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటాయి. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. ఉద్యోగస్తులు తలపెట్టిన పనిలో అవాంతరాలను ఎదుర్కొంటారు. సోదరీ సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం : ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. ప్రముఖుల కలయిక కోసం పలుమార్లు తిరగవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. 
 
సింహం : కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. విద్యార్థులు తోటివారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
కన్య : చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల చికాకులు అధికమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడగలవు. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడటం మంచిది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. 
 
తుల : ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. 
 
వృశ్చికం : వ్యాపారాల్లో మొహమ్మాటం వీడి లౌక్యంగా ప్రదర్శించండి. ఎంతటి కష్టాన్నైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. ఆత్మ విశ్వాసం రెట్టింపు అవుతుంది. గట్టిగా ప్రయత్నిస్తేనే మొండిబాకీలు వసూలవుతాయి. రెట్టించిన ఉత్సాహంతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. 
 
ధనస్సు : ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉంటుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. స్త్రీలకు బంధు వర్గాలతో సఖ్యత నెలకొంటుంది. రుణం ఏ కొంతైనా తీర్చగలుగుతారు. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. భాగస్వామికుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. 
 
మకరం : ఆర్థికంగా పురోభివృద్ధి పొందుతారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. అవగాహన లేని విషయాలకు, చేతకాని పనులకు దూరంగా ఉండటం మంచిది. 
 
కుంభం : ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు ఉంటాయి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. రాజకీయ, సాంకేతిక వర్గాల వారికి శ్రమాధిక్యం తప్పదు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి హడావుడి ఎదుర్కొంటారు. 
 
మీనం : వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. మీ ప్రత్యర్థులు తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. గృహ నిర్మాణాలు, అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు... శుక్రవారం అంకురార్పణ