Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-09-2020 మంగళవారం దినఫలాలు - మహాలక్ష్మిని ఆరాధిస్తే సర్వదా శుభం

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. స్త్రీలకు షాపింగ్‌లోనూ, చెల్లింపుల్లోనూ ఆప్రమత్తత అవసరం. రచయితలకు, పత్రికా రంగాలలో వారికి శుభదాకయంగా ఉంటుంది. 
 
వృషభం : ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి వాతావరణంలో మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. 
 
మిథునం : రుణాలు, బకాయిల వసూళ్ళ విషయంలో జాప్యం వంటివి తప్పవు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఒక విషయంలో అయినవారే మిమ్మలను శంకించేందుకు ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికం. 
 
కర్కాటకం : బంధువుల ఒత్తిడి వల్ల నిర్లక్ష్యం తగదు. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికం. వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళనలు కలిగిస్తాయి. 
 
సింహం : ఊహించని రీతిలో ధనలబ్ది పొందుతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి. 
 
కన్య : మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధికమిస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. స్త్రీలకు అలసట అధిక శ్రమ తప్పదు. ప్రభుత్వ ఉద్యోగులకు పనిభారం అధికమవుతుంది. ఇతరులతో వీలేనంత క్లుప్తంగా మాట్లాడటం శ్రేయస్కరం 
 
తుల : బ్యాంకు పనులలో చికాకులు అధికమవుతాయి. చిన్న చిన్న విషయాలకు పెద్దలతో ఏకీభవించలేకపోతారు. ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి యత్నించండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
వృశ్చికం : ముఖ్యుల రాకపోకల వల్ల ఉత్సాహం కానవస్తుంది. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా మీ బాధ్యతలు పెరుగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించి చిన్నతనంగా భావించకండి. సేవ, పుణ్యకార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. 
 
ధనస్సు : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రుల కలయిక అనుకూలించకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాకయంగా ఉంటుంది. మీ ఆశయానికి అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. 
 
మకరం : ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అవకాశం కలిసివస్తుంది. ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. 
 
కుంభం : రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదర్శభావాలు గల వ్యక్తుల పరిచయం వల్ల మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 
 
మీనం : కాంట్రాక్టర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. నూతన వ్యాపారాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. మార్కెటింగ్, ప్రైవేటు, పత్రికా రంగంలోని వారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments