Webdunia - Bharat's app for daily news and videos

Install App

15-10-2020 గురువారం రాశిఫలాలు - రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తే...

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (08:41 IST)
మేషం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మిత్రులతో కలసి ఆలయాల సందర్శనాలలో ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఇతరుల ముందు దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. 
 
వృషభం : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల బరువు, బాధ్యతలు అధికమవుతాయి. పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతన విడనాడండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మిథునం : నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి. బంధువులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుట వల్ల ఆందోళనకు గురవుతారు. రావలిసిన ఆదాయం గురించి ఆందోళన చెందుతారు. మీ కుటుంబ సమస్యలు ఏకరవు పెట్టడం వల్ల మంచిదికాదని గ్రహించండి. బ్యాంకింగ్ రంగాల వారు చికాకులను ఎదుర్కొంటారు. 
 
సింహం : నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక కార్యం నిమిత్తం దూర ప్రాంతానికి ప్రయాణం చేయవలసి రావొచ్చు. 
 
కన్య : వ్యాపారాల్లో పెరిగిన పోటీ వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. వీలైతే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికం. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక రంగంలో వారికి కలిసివచ్చే కాలం. స్త్రీలు షాపింగులకు ధనం బాగా వ్యయం చేస్తారు. 
 
తుల : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి లభిస్తుంది. బంధువుల నుంచి విమర్శలు తప్పవు. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‍‌కాలంను వినియోగించుకోండి. శత్రువులు, మిత్రులుగా మారి సహాయాన్ని అర్థిస్తారు. 
 
వృశ్చికం : ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. నిర్మాణ పనుల్లో పెరిగిన వ్యయం, జాప్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగంలోని వారికి అచ్చు తప్పులు దొర్లుట వల్ల పై అధికారుల చేత మాటపడక తప్పదు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
ధనస్సు : రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. మీ పిల్లల వైఖరి చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఆపద సమయంలో బంధువుల అండగా నిలుస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. 
 
మకరం : ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులసహాయం అందుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు దుడుకుతనం తగదు. రాజకీయ నాయకులు అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాలు తప్పవు. 
 
కుంభం : ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దైవదర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. నూతన పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందివచ్చిన అవకాశం చేజారినా మంచికేనని భావించండి. 
 
మీనం : గత తప్పిదాలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు అదుపుకాకపోగా మరింతగా ధనవ్యయం అవుతుంది. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments