Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14-10-2020 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజిస్తే అన్ని విధాలా శుభం...

14-10-2020 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజిస్తే అన్ని విధాలా శుభం...
, బుధవారం, 14 అక్టోబరు 2020 (08:56 IST)
మేషం : సన్నిహితులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు, ఇతరాత్రా రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. బాధ్యతలు పెరిగినా మీ సమర్థతను నిరూపించుకుంటారు. 
 
వృషభం : మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. మీ సంతానం కదలికలను గమనిస్తూ ఉండాలి. స్త్రీలు షాపింగ్‌ వ్యవహారాలలో, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఉమ్మడి, సొంత వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
మిథునం : మీ కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశం లభిస్తుంది. ప్రముఖులతో ముఖ్య వ్యవహారంపై సంప్రదింపులు జరుపుతారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. వస్త్ర, బంగారు, వ్యాపారులకు శ్రమకు మిశ్రమ ఫలితం. స్త్రీల మాటకు ఇంటా, బయటా ఆదరణ లభిస్తుంది. 
 
కర్కాటకం : ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు చేస్తారు స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి. 
 
సింహం : ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్ల మెలకువ వహించండి. చిన్నతరహా పరిశ్రమలు, చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. 
 
కన్య : స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పువు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ఏకాగ్రత ముఖ్యం. ఆలయాలను సందర్శిస్తారు.
 
తుల : తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమాధిక్యత వంటి చికాకులు తప్పవు. బ్యాంకింగ్ వ్యవహారాలల పనులు మందకొడిగా సాగుతాయి. పత్రికా సంస్థలలో పనిచేసే వారికి సదావకాశాలు లభిస్తాయి. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు ఇది అనువైన సమయం. 
 
వృశ్చికం : కుటుంబంలో ఏర్పడిన వాదనలను పట్టించుకోకపోవడం మంచిది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. సుసాధ్యమనుకున్న ఒక వ్యవహారం మీకు సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
ధనస్సు : అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచే చేస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్త్రీ మూలకంగా వివాదాలు ఎదుర్కొంటారు. విద్యార్థులు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ సంతానం మొండివైఖరి వల్ల ఇబ్బందులు తప్పవు. 
 
మకరం : మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. రాబడికి మించిన ఖర్చులెదురవుతాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, తనిఖీలు అధికం. ఆలయాలను సందర్శిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
కుంభం : బ్యాంకుల్లో మీ పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు అనదునపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందవలసి వస్తుంది. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. 
 
మీనం : కళ, క్రీడా, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. సొంత వ్యాపారాలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. రావలసిన ఆదాయంపై దృష్టిసారిస్తారు. దైవ దీక్షలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థినిలకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్వేతార్క గణపతిని బుధవారం పూజిస్తే.. జిల్లేడు చెట్టు ఇంట్లో వుండొచ్చా?