Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-10-2020 శుక్రవారం రాశిఫలాలు - పార్వతీదేవిని పూజించినా మనోవాంఛలు...

Advertiesment
Daily Horoscope
, శుక్రవారం, 9 అక్టోబరు 2020 (04:00 IST)
మేషం : మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. 
 
వృషభం : కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తన ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం, చికాకులు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మిథునం : మీపై సెంటిమెంట్లు, గత అనుభవాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. మీ సమర్థతపై నమ్మకం సడలుతుంది. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఫ్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కర్కాటకం : ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కొంటారు. 
 
సింహం : దైవ దర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో భేషజం మొహమ్మాటాలు కూడదు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించదు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికంగా ఉంటాయి. బంధువులను కలుసుకుంటారు. 
 
కన్య : స్త్రీలకు విలాస వస్తువుల, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెట్టిపోతల విషయంలో పెద్దల సలహా పాటించడం శ్రేయస్కరం. నేడు చేజారిన అవకాశం తిరిగి రావడం కష్టమని గ్రహించండి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.
 
తుల : కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు లేఖలు అందుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఒక దైవకార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి.
 
వృశ్చికం : విదేశాలు వెళ్లడానికి చేయు ప్రయ్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అవకాశం కలిసివస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. 
 
ధనస్సు : కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. 
 
మకరం : ఫ్యాన్సీ, వస్త్ర, కిరాణా, కిళ్లీ రంగాలలో వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతుంది. స్త్రీలు తెలివి తక్కువగా వ్యవహరించడం వల్ల చేపట్టిన పని కొంత ముందు వెనుకలుగానైనా జయం చేకూరుతుంది. 
 
కుంభం : సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారిపట్టే ఆస్కారం ఉంది. 
 
మీనం : బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అయినవారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి. ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశనెరవేరదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిటిడీ కొత్త ఈవోగా జవహర్ రెడ్డి నియామకం...