Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-10-2020 గురువారం రాశిఫలాలు - రాఘవేంద్ర స్వామికి ఆరాధన చేస్తే...

Advertiesment
08-10-2020 గురువారం రాశిఫలాలు - రాఘవేంద్ర స్వామికి ఆరాధన చేస్తే...
, గురువారం, 8 అక్టోబరు 2020 (05:00 IST)
మేషం : భాగస్వామిక వ్యాపారాల్లో ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఒకింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చుసుకోవడం ఉత్తమం. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం : ప్రైవేటు, పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి మరికొంత కాలం వేచివుండక తప్పదు. రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
మిథునం : భాగస్వామ్యంగా కంటే సొంత వ్యాపారాల్లోనే రాణిస్తారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. విద్యార్థినులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉద్యోగస్తుల ప్రతిభకు, పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు వింటారు. చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు అనుకూలమైన కాలం. మీ లక్ష్యసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల అవసరమని గమనించండి. ఆధ్యాత్మిక చింతన, వ్యాపకాలు పెరుగుతాయి. 
 
సింహం : ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. స్త్రీలలో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. కొంతమంది మీ నుంచి కీలకమైన విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. 
 
కన్య : స్త్రీలు, వైద, శుభ కార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రచయితలకు, కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఏజెంట్లకు బ్రోకర్లకు చికాకులు, నిరుత్సాహం అధికమవుతాయి. సన్నిహితుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. 
 
తుల : దైవ, సేవ, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబీకులతో ఏకీభవించలేరు. ఉద్యోగస్తులు స్థానమార్పిడికి అవకాశం ఉంది, ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, ఒత్తిడి తప్పవు. విద్యార్థినులు వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలలో ప్రోత్సాహం కానవస్తుంది. 
 
వృశ్చికం : దంపతుల మధ్య కలహాలు, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల మాట పడవలసి వస్తుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది. స్త్రీలు బంధు వర్గాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. 
 
ధనస్సు : స్త్రీలకు నుడుము, నరాలకు, కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. అనవసర ఖర్చులు, మితిమీరిన ధనవ్యయంతో ఆందోళన చెందుతారు. 
 
మకరం : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగస్తులకు అధికారులకు మధ్య సమన్వయం లోపిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. 
 
కుంభం : మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలపై శకునాలు, ఎదుటివారి మాటలు తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్న తప్పిదమైనా సునిశితంగా ఆలోచించడం క్షేమదాయకం. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. 
 
మీనం : నిత్యావసర వస్తు, స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మీ సంతానం మొండితనంతో అసహనానికి గురవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హయగ్రీవునికి బుధవారం యాలకుల మాల సమర్పిస్తే..? (video)