Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

06-10-2020 మంగళవారం రాశిఫలాలు - కార్తికేయుడిని పూజిస్తే... (video)

06-10-2020 మంగళవారం రాశిఫలాలు - కార్తికేయుడిని పూజిస్తే... (video)
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (05:00 IST)
మేషం : విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యక్రమాలను గుర్తుగా రాసి ఉంచుకోవడం ఉత్తమం. స్త్రీలు షాపింగ్‌లోనూ, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి, అనుభవం కొద్ది లాభాలు గడిస్తారు. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. 
 
వృషభం : ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం కలిసివస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. సన్నిహితుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. బంధువుల రాకతో పనులు కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మిథునం : స్త్రీలకు టీవీ చానెళ్ళ నుంచి ఆహ్వానం అందుతుంది. దుబారా ఖర్చులు మీకు తెలియకుండానే అవుతాయి. సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. ప్రయాణాలు అనుకూలం. కుటుంబీకుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఎంతటి కష్టాన్నైనా నిబ్బరంగా భరిస్తారు. మిత్రుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
కర్కాటకం : చిన్ననాటి వ్యక్తుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. అయినవారి కోసం బాగా శ్రమిస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. మీ వ్యతిరేకతను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
సింహం : రాజకీయ నాయకులు ప్రముఖులతో కలిసి విందులలో పాల్గొంటారు. పెద్దల జోక్యంతో ఆస్తి, కుటుంబ వివాదాలు సద్దుమణుగుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. వాహనం, వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. 
 
కన్య : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. సన్మాన సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. 
 
తుల : అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. వ్యవహార ఒప్పందాల్లో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. 
 
వృశ్చికం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. మీ వాహనం, విలువైన వస్తువులు ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. తొందరపాటు నిర్ణయం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. దూర ప్రయాణాలలో పరిచయాలేర్పడతాయి. ఒక దైవ కార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
ధనస్సు : సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలకు నరాలు, దంతాలు, రుతు సంబంధిత చికాకులు అధికం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడుపుతారు. 
 
మకరం : స్థిరాస్తుల కొనుగోళ్ళపై దృష్టిసారిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపార, ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. 
 
కుంభం : ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. చిన్న తప్పిదాలే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. స్త్రీల ప్రతిభా పాటవాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పువు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. 
 
మీనం : ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. విద్యార్థులు ప్రతిభా పోటీల్లో రాణిస్తారు. తలపెట్టిన పనిలో ఆటంకాలు ఎదురైన ధైర్యం, పట్టుదలతో శ్రమించి విజయం సాధిస్తారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-10-2020 నుంచి 10-10-2020 వరకు మీ వార రాశి ఫలాలు ఎలా వున్నాయంటే (video)