Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

07-10-2020 బుధవారం రాశిఫలాలు - మహావిష్ణువును ఆరాధిస్తే... (video)

07-10-2020 బుధవారం రాశిఫలాలు - మహావిష్ణువును ఆరాధిస్తే... (video)
, బుధవారం, 7 అక్టోబరు 2020 (04:00 IST)
మేషం : మీ సమర్థతపై భాగస్వామికులకు నమ్మకం కలుగుతుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు కలిసివచ్చేకాలం. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. 
 
వృషభం : విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి కార్మికులకు కలిసిరాగలదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం చేస్తారు. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. బంధువుల ఆకస్మిక రాకవల్ల గృహంలో సందడి కానవస్తుంది. 
 
మిథునం : స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం భవిష్యత్ బాగుటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. ఆకస్మిక ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. 
 
సింహం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. స్త్రీల అభిప్రాయాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. 
 
కన్య : ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. మీడియా రంగాల వారికి పనిభారం అధికం. స్త్రీలకు షాపింగ్‌ల్లో నాణ్యతను గమనించాలి. రుణాల కోసం అన్వేషిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
తుల : ఫర్నీచర్ అమరికలకు అవరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్ల చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో హామీలు, మధ్యవర్తిత్వం వహించండ వల్ల మాటపడవలసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. గృహంలో వస్తువు పోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములు రావొచ్చు. జాగ్రత్త వహించండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. 
 
ధనస్సు : పారిశ్రామిక రంగాల వారికి ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు. పై అధికారులు, ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. 
 
మకరం : స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్లు తప్పవు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
కుంభం : మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. పాత వస్తువను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. 
 
మీనం : మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయడం మంచిదికాదు. బంధు మిత్రుల కలయిక మీకెంతో సంతృప్తినిస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి కలిసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ధైర్యంతో ముందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం పూట కుంకుమ కింద పడితే..? (video)