Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-10-2020 శనివారం రాశిఫలాలు - పార్వతిదేవిని పూజిస్తే మనోవాంఛలు... (video)

Advertiesment
Daily Horoscope
, శనివారం, 10 అక్టోబరు 2020 (05:00 IST)
మేషం : కొబ్బరి, పండ్లు పూలు, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. పెద్దలు, ప్రముఖుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు, అధికారులకు కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి తెలియజేయడం మంచిది. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థినులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త స్కీంలు, షాపుల అలంకరణలు చేపడతారు. ఉద్యోగస్తుల ఓర్పు పనితనానికి ఇది పరీక్షా సమయం. 
 
మిథునం : ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనిభారం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఫ్లీడరు గుమస్తాలకు ఒడిదుడుకులు తప్పవు. పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
కర్కాటకం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దైవ, సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గంటారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థినులు, విద్యార్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. 
 
సింహం : వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. విదేశాలు వెళ్లడానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రైవేటు పత్రికా రంగంలోని వారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
కన్య : వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. మీ సంతానం పై చదువుల పట్ల దృష్టిసారిస్తారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. ఉద్యోగస్తుల పనితీరుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన తేలకపోవడంతో అసహనం తప్పదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
తుల : మీ చిన్నారులకు ధనం అధికంగా వెచ్చిస్తారు. వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
వృశ్చికం : కొత్తపనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. పత్రికా సిబ్బందికి వార్త ప్రచురణలో పునరాలోచన మంచిది. బంధు మిత్రుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. 
 
ధనస్సు : ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదుర్కొంటారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్ పని వారు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.
 
మకరం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. రాజకీయకులకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపార వర్గాల వారికి చెక్కుల జారీలో ఏకాగ్రత ముఖ్యం. 
 
కుంభం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. సొంత వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యంగా మీ తాహతుకు మించి ఖర్చు చేయకండి. 
 
మీనం : చిన్నారుల విషయంలో పెద్దలగా మీ బాధ్యతలను నిర్వహిస్తరాు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయుల పనితీరుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడికి వెళ్లినప్పుడు ఇలా చేయాలి