Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-06-2021 ఆదివారం దినఫలాలు - ఆర్థికంగా బాగుగా కలిసివస్తుంది..

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (04:00 IST)
మేషం : ఆర్థికంగా బాగుగా కలిసివస్తుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు కాస్త చికాకుపరుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గతం కంటే అనుకూలమైన సమయం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అందరితో కలిసి వైద్య, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
వృషభం : వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పాత మిత్రులను కలుసుకుంటారు. పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో బాగుగా రాణిస్తారు. 
 
మిథునం : ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ, సేవా, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. విందులలో పరిమితి పాటించండి. 
 
కర్కాటకం : ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేక పోతారు. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. చిరకాలపు ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. 
 
సింహం : సభలు, సమావేశాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. విద్యార్థులకు క్రీడా రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రాజకీయాలలో వారికి సంఘంలో స్థాయి పెరగగలదు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. 
 
కన్య : ఆదాయ వ్యయాలలలో మీ అంచనాలు ప్రణాళికాబద్దంగా ఉంటాయి. వాహనం ఇతరులకుఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. తాపిపనివారికి లాభదాయకంగా ఉంటుంది. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. నిబద్ధతతో పని చేస్తే అంతా విజయమే. తోబుట్టువులతో వివాదాలు తలెత్తుతాయి. 
 
తుల : మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి, సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. పట్టు విడవకుండా మీ యత్నాలు సాగించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృశ్చికం : కొబ్బరి, మామిడి, పండ్లు, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ ఉత్సాహన్ని అందుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
ధనస్సు : మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. విందులు, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు ఊహించని వారి నుంచి సదావకాశాలు లభిస్తాయి. పని మొదలుపెట్టినా ఆదిలోనే హంసపాదులా తయారవుతుంది. 
 
మకరం : పెంపుడు జంతువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు  విశ్రాంతి లభిస్తుంది. భాగస్వామిక, సొంత వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మీ సంతానం పై చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. 
 
కుంభం : విద్యుత్, ఏసీ, కూలర్, మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. చిన్న చిన్న విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. మిత్రులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు, గృహ ప్రశాంతత పొందుతారు. హోటల్, తినుబండారు వ్యాపారుల లాభదాయకం. 
 
మీనం : సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments